BREAKING
ధాన్యం కొనుగోలుపై సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమం శ్రీహరిపురంలో పల్లె నిద్ర కార్యక్రమం నవంబర్ 14 నుండి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతం చేయండి గ్రంథాలయ వారోత్సవాలకు అధికారులకు ఆహ్వానం మండల పరిషత్ పీఠంపై"మరడాన"ముద్ర.. సంక్రాంతి బరిలో సందడికి సిద్ధం.. రెండు నెలల ముందే ప్రమోషన్స్ షురూ చేసిన అనిల్ రావిపూడి ఆటపాటలతో కూడిన బోధనపై అంగన్వాడీలకు ప్రత్యేక శిక్షణ...ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనకదుర్గ. పరిషత్ పోరులో కీలక ఘట్టం.. ఎంపీపీ ఎన్నికకు వేళాయే లాయర్‌గా కీర్తి సురేశ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్.. సత్యవాన్ సావిత్రి ట్రైలర్ విడుదల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు మన్యం సవారి లో ఎన్ జి ఓ నాయుకులు గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి ఎంతవరకు మేలు చేస్తుంది? వైద్యులు చెబుతున్న అసలు నిజాలు ఇవే మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మృతి టీడీపీకి, రాజకీయ రంగానికి తీరని లోటు చేయి తడిపితే చాలు.. చెక్ పోస్టు దాటెయ్యడమే!!!

ఘనంగా శ్రీ కనకదుర్గమ్మ గాజుల పండుగ మహోత్సవం అమ్మవారికి సారె సమర్పించిన ఎమ్మెల్యే సతీమణి రేణుకా రెడ్డి

Select Suryaa Now
ఘనంగా శ్రీ కనకదుర్గమ్మ గాజుల పండుగ మహోత్సవం  అమ్మవారికి సారె సమర్పించిన ఎమ్మెల్యే సతీమణి రేణుకా రెడ్డి

పలమనేరు మేజర్ న్యూస్ భగిని హస్త భోజనాన్ని పురస్కరించుకుని పలమనేరులో నిర్వహించిన శ్రీ కనకదుర్గమ్మ గాజుల పండుగ మహోత్సవం బుధవారం అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలోని పాతపేట శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయం ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సతీమణి రేణుకా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె చేతుల మీదుగా అమ్మవారి సారె ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ సారె ఊరేగింపు కనకదుర్గమ్మ ఆలయం వరకు భక్తిపూర్వకంగా సాగింది.ఆలయానికి సారె చేరుకున్న సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి సాంప్రదాయబద్ధంగా సారె సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు భగిని హస్త భోజనం విశిష్టత, సోదరీ సోదరుల మధ్య ఉండే ఆత్మీయ అనుబంధం, ఈ పర్వదినం వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు.భారతీయ సంస్కృతిలో సోదరీసోదరుల అనుబంధానికి భగిని హస్త భోజనం ప్రత్యేక గుర్తింపునిస్తుందని, ఇటువంటి పండుగలు కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తాయని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.అనంతరం ఆలయ అర్చకులు ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సతీమణి రేణుకా రెడ్డితో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్ రాజలక్ష్మి కృష్ణమూర్తి, కౌన్సిలర్లు, స్థానిక నాయకులను ఆలయ మర్యాదలతో ఘనంగా సన్మానించారు.ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి, సంప్రదాయం, మహిళల ఆధ్యాత్మిక భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిచిన ఈ గాజుల పండుగ మహోత్సవం పలమనేరులో పండుగ వాతావరణాన్ని నింపింది.

 

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్