ఘనంగా బాలల దినోత్సవం
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : వి ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో శనివారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ప్రిన్సిపాల్ చింతాల వెంకట్రావు, వైస్ ప్రిన్సిపాల్, టి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పిల్లలు అంటే నెహ్రూ కు చాలా ఇష్టమని నెహ్రూ జయంతి రోజు బాలల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. భారతదేశపు తొలి ప్రధానమంత్రి నెహ్రూ అని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బాలల దినోత్సవం సందర్భంగా విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో విద్యార్థులు వివిధ సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు వివిధ వేషధారణలో పలువురిని ఆకర్షించే విధంగా కనిపించారు. ఈ సందర్భంగా బాలల దినోత్సవం పురస్కరించుకొని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులు విద్యార్థులకు ప్రశంస పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఉపాధ్యాయులు, ప్రైమరీ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ జయలక్ష్మి, వి ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ కమిటీ సభ్యులు మంజీరా, పీ. మాధవి, సయ్యద్ మహమ్మద్ రఫీ,ఆర్.మాధవి, సుజిత, పి. ప్రవల్లిక వి.సుప్రజ, నీలిమ తదితరులు పాల్గొన్నారు.