BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

గరుగుబిల్లి మండల వైసిపి జడ్పిటిసి అభ్యర్థిగా నాగమణి

Select Suryaa Now
గరుగుబిల్లి మండల వైసిపి జడ్పిటిసి అభ్యర్థిగా నాగమణి
  • ప్రకటించిన మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి
  • జడ్పీ మాజీ వైస్ చైర్మన్ బాపూజీ నాయుడు,కేతిరెడ్డి అచ్యుతరావులు

గరుగుబిల్లి, సూర్య: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగముగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గరుగుబిల్లి మండల జడ్పిటిసి అభ్యర్థిగా గుజ్జల నాగమణి పేరును అధిష్టానం ప్రకటించింది.ఈమేరకు సోమవారం చినమేరంగి క్యాంపు కార్యాలయంలో కురుపాం నియోజ కవర్గo మాజీ శాసనసభ్యులు మరియు మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గరుగుబిల్లి మండల జిల్లా ప్రాదేశిక సభ్యురాలు(జడ్పిటిసి) గా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనలు మేరకు గుజ్జల నాగమణి పేరును ప్రకటించారు.గరుగుబిల్లి మండల జడ్పీటీసీ టికెట్ ను ఎస్ సి మహిళకు కేటాయించారు.ఈనేపథ్యం లో మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ సి సెల్ అధ్యక్షులు గుజ్జల ఈశ్వర రావు సతీమణి గుజ్జల నాగమణికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మండల జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసేందుకు అధిష్టానం అవకాశం కల్పించింది.వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గరుగుబిల్లి మండల జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుజ్జల నాగమణి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు.ఇదిలా ఉండగా తనపై నమ్మకం ఉంచి గరుగుబిల్లి మండల జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించిన మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ మరిశర్ల బాపూజీ నాయుడు, మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కేతిరెడ్డి అచ్యుతరావులకు గుజ్జల నాగమణి కృతజ్ఞతలు తెలియజేశారు.