BREAKING
భారత్‌ ఖాతాలో 18వ పసిడి, 78 పతకాలతో 5వ స్థానంలో టీమిండియా రాప్తాడు పీహెచ్‌సీకి జిల్లా స్థాయి స్వచ్ఛ అవార్డు స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు అందుకున్న సిబ్బంది ఏషియా కప్ ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. బస్సులు సమయానికి నడపాలంటూ విద్యార్థుల ధర్నా ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్‌కు సిట్ నోటీసులు! శ్రీ సిటీలో టిల్ హెల్త్ కేర్ కంపెనీలో పేలుడు భారీ ప్రాణ నష్టం జరిగినట్లు అంచనా కన్యకాపరమేశ్వరి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం గాంధీ మార్గం అనుసరణీయం సరిహద్దుల్లో అవినీతి, వీసా అక్రమాలపై దక్షిణాఫ్రికా ఉక్కుపాదం: సంయుక్త దర్యాప్తు సంస్థల రంగప్రవేశం! గాంధీ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నివాళులు మృతురాలి కుటుంబానికి చికెన్ శీనా యాదవ్ ఆర్థిక సాయం గజపతినగరంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం… అలాస్కా ఎల్‌ఎన్‌జీ ప్రాజెక్టుపై ట్రంప్ సంచలన హెచ్చరిక: పెట్టుబడులు పెట్టకపోతే దక్షిణ కొరియాపై 'డబుల్ ఛార్జ్' వేస్తామని అల్టిమేటం! వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం, భర్తతో గొడవపడి ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీం కోర్టుకు..

గడువు ముగిసిన వైన్‌షాప్‌.. ధాబాలో మద్యం విక్రయాలా?

Select Suryaa Now
గడువు ముగిసిన వైన్‌షాప్‌.. ధాబాలో మద్యం విక్రయాలా?

గన్నవరం, అక్టోబర్ 2, మేజర్ న్యూస్.

గన్నవరం మండలం కేసరపల్లి పరిధిలోని బాబీ ధాబాలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ధాబాలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తున్నారని, నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. ధాబాకు సమీపంలో ఉన్న చిల్లీస్ వైన్‌షాప్‌ గడువు సెప్టెంబర్ 30 తో ముగిసిన నేపథ్యంలో, ఆ తర్వాత బాబీ ధాబాలో పెద్ద ఎత్తున మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిక ధరలకు మద్యం విక్రయించడంపై కొందరు మద్యం ప్రియులు ధాబా నిర్వాహకులను ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. స్థానికులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగిందని, మద్యం విక్రయిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గన్నవరం ఎక్సైజ్‌ అధికారులు ధాబాను పరిశీలించినప్పటికీ, భారీగా మద్యం నిల్వలు ఉన్నాయన్న ఆరోపణలపై ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకున్నారో వెల్లడించాల్సి ఉంది. ధాబాలో మద్యం నిల్వలు, విక్రయాలకు అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.