ఎస్ ఎల్ గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు.
సూర్య న్యూస్ అద్దంకి. బల్లికురవ మండలం ఎస్ ఎల్ గుడిపాడు నామ్ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బాధితుని సమాచారం మేరకు ఎస్ఎల్ గుడిపాడు కాలనీకి చెందిన సాంబయ్య రోడ్డు పక్కనే నడుచుకుంటూ వెళుతున్నాడు. ఆ సమయంలో ద్విచక్ర వాహనం ఢీకొనటంతో గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నామ్ రహదారి అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని అద్దంకి ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు.