ఎస్ ఐ పై దాడి కేసులో 19 మంది పై కేసు నమోదు.
సూర్య న్యూస్ దర్శి.
దర్శి మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు సంబంధించి ఎస్ఐ జి .ఏడుకొండల పై వైసీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. అందుకు సంబంధించి 19 మంది పై కేసు నమోదు అయింది. దర్శి వైసీపీ మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ పోశం మధుసూదనరెడ్డి, గూడ శ్రీధర్ రెడ్డి, కుమ్మిత జయరాం రెడ్డి, మారం ఇంద్ర సేనారెడ్డి, ఎడమ కంటి నాగార్జున్ రెడ్డి , బత్తిన వెంకట్రావు, భవనం అంజిరెడ్డి, చింతలపూడి శ్రీనివాసరెడ్డి, సోము దుర్గారెడ్డి, బండి గోపాల్ రెడ్డి, మెడగం పుల్లారెడ్డి, జి అంజిరెడ్డి చింతా శ్రీనివాసరెడ్డి, బంకా నాగిరెడ్డి, దుగ్గిరెడ్డి నారాయణ రెడ్డి, నల్లమోలు మోహన్ చౌదరి, కాకర్ల కృష్ణ రెడ్డి, గొంగటి పోలిరెడ్డి మరికొందరి పై పోలీసులు కేసు నమోదు చేశారు.