BREAKING
ఆర్థిక సహాయం అందజేత కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం! కివీస్ గడ్డపై టీమిండియా సరికొత్త చరిత్ర: ఏడేళ్లుగా న్యూజిలాండ్‌లో అజేయంగా భారత జట్టు! ఐపీఎల్ 2027: కోచ్‌గా మారిన స్టార్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం! అనివార్య కారణాలతో ప్రవీణ్ అరోర రథయాత్ర వాయిదా భారతీయ సినిమాకు బాలీవుడ్ అందించిన చరిత్రాత్మక సేవలు: మూలాలు మొదలు ఆధునిక మార్పుల వరకు! గిద్ద పెరుమాండ్ల టెంపుల్‌లో జమ్మి పూజలో పాల్గొన్న ఆకుల నరసన్న పటేల్ 32వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గా బట్టే వెంకట కీర్తి వైరల్ కావడమే నేటి యువత పరమావధిగా మారిందా: సోషల్ మీడియా ట్రెండ్స్ వెనుక ఉన్న చేదు నిజాలు! ఓటీటీల హవా ప్రభావం: చిన్న సినిమాలకు సువర్ణావకాశమా లేక థియేటర్లకు పెను ముప్పు ? ప్రజాసేవే లక్ష్యంగా..... ఒక్క అవకాశం ఇవ్వండి 31 వ డివిజన్ లో అభివృద్ధి చేసి చూపిస్తాం... జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట చర్యలు *సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు

Select Suryaa Now
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట చర్యలు  *సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు

నరసాపురం సూర్య న్యూస్ల్: నరసాపురం పురపాలక సంఘం, ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి, వ్యయ పరిశీలకులు, ఐఎఫ్ఎస్ అధికారి అహ్మద్ అబ్దుల్ రావుఫ్ షేక్‌తో కలిసి నరసాపురంలోని వైఎన్ కళాశాల పీజీ, ఎంబీఏ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల బ్యాలెట్ బాక్సుల భద్రపరిచే గదులు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సామగ్రి భద్రత, ఓట్ల లెక్కింపునకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బందికి కల్పించాల్సిన వసతులు, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.

ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

అనంతరం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల నియమావళి అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని, ఫ్లయింగ్ స్క్వాడ్, చెక్‌పోస్టుల ద్వారా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని వివరించారు.

మొదటి విడతలో నరసాపురం పురపాలక సంఘం, ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి అక్టోబరు 28న పోలింగ్, అక్టోబరు 30న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అక్టోబరు 21 నుంచి మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలకు నవంబరు 3న పోలింగ్, నవంబరు 5న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల, నరసాపురంలోని వై ఎన్ ఎం కళాశాల, తాడేపల్లిగూడెంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు ఎన్నికల అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి కోరారు.

*ఎన్నికల భద్రతకు అదనపు బలగాలు

జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఒకే సమయంలో ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో అవసరమైన అదనపు పోలీసు బలగాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళిని ఎవరైనా ఉల్లంఘించినా, ఎన్నికలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా సంబంధిత టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఎన్నికల సమయంలో ఘర్షణలను నివారించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా సున్నితమైన ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ అన్ని చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో రమణ, డిప్యూటీ సీఈవో వై దోసిరెడ్డి, ఆర్డిఓ దాసిరాజు, డీఎస్పీ మేక సుధాకర్, 

 డి ఎల్ డి ఓ శ్యామల, ఎంపీడీవో నసరురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.