ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలి
- ఎన్నికల అధికారి ఎం వాణిశైలజ వెల్లడి
- ఎంపీడీవో నడిమింటి సూర్యనారాయణ,తహసిల్దార్ పాము బాల
- ఎన్నికల కోడ్ అమలుపై మండల స్థాయి అధికారులతో సమావేశం
గరుగుబిల్లి, సూర్య: స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా నిష్పక్షపాతముగా పారదర్శకంగా నిర్వ హించేందుకు క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని మండల ఎన్నికల అధికారి ఎం వాణిశైలజ వెల్లడించారు. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సోమవారం మండల స్థాయి అధికారులతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై ప్రత్యేక సమావేశమును నిర్వహించా రు.ఈసందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని గ్రామ పంచాయతీల పరిధిలో అమలు చేసే అంశంపై మండల ఎన్నికల అధికారి ఎం వాణిశైలజ తగు సూచనలు, సలహాలను అంద జేశారు.అనంతరం మండల ఎన్నికల అధికారి ఎం వాణిశైలజ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల పరిధిలో రాజకీయ ప్రతినిధులు కోడ్ ఉల్లంఘించకుండా నిరంతరం పర్యవేక్షించాలని నిబంధ నల అమలకు తగిన చర్యలు తీసుకో వాలని తెలియజేశారు.స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం జరిగింద న్నారు.అదే విధంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయాలన్నారు.అదే విధంగా నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలన్నారు.గ్రామ పంచాయ తీల పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమాలని పగడ్బందీగా అమలు చేసేందుకు మండల స్థాయి అధికారు లు తగు చర్యలు చేపట్టాల్సి ఉందన్నా రు.ఈసమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి నడిమింటి సూర్యనారాయణ,మండల తహసిల్దార్ పాము బాల, స్థానిక ఎస్ ఐ షేక్ ఫక్రుద్దీన్, కార్యాలయం పరి పాలనాధికారి నాలి అర్జునరావు, మండల వ్యవసాయ శాఖ అధికారి తుమ్మనపల్లి జ్యోత్స్న, డిప్యూటీ ఎంపీడీవో మరడాన వెంకటే శ్వరరావు,వెలుగు ఏ పి ఎం పెదిరెడ్ల అప్పలనాయుడు, హౌసింగ్ ఏఈ వంగపండు అఖిల్ నాయుడు, కార్యాలయ సిబ్బంది బెంకిలి శ్రీనివాసరావు,గుంట్రేడ్డి కృష్ణప్రసాద్, అలజంగి శ్రీకాంత్, గంట విజయలక్ష్మి, డాకోజు సూర్యప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.