BREAKING
అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన గురునాథ్ ఆధ్వర్యంలో పదో వార్డు టిడిపి నేతలతో సమావేశం.... ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహనకు సైక్లథాన్ *రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలి * దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి కార్పొరేటర్ ఏడువాక దంపతులకు ఘన సన్మానం శ్రీకొండలమ్మను దర్శించుకున్న 7 వేలమంది భక్తులు భారత్–శ్రీలంక వన్డే టికెట్ల విక్రయానికి ముహూర్తం ఖరారు ఐదుగురు బాధితులకు సహాయం అందించిన మానవత. విశాఖలో యువకుల వీరంగం.. రాళ్లు, రాడ్లతో దాడులు! ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్న సర్పంచ్ అభ్యర్థి బండ్లమూరి వెంకటేశ్వరరావు మంత్రి నారా లోకేష్ ను కలిసిన ' పులుగోరు' మంత్రి నారా లోకేష్ ను కలిసిన ' పులుగోరు' గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ గా వై.ఎస్ రవి యాదవ్ అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబానికి అండగా ముత్యాల సునీల్ కుమార్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వ

Select Suryaa Now
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు  జిల్లా ఎస్పీ  బి. ఉమామహేశ్వ

చీరాల, మేజర్‌న్యూస్‌ :

చీరాల నియోజకవర్గంలో ఈ నెల 29న జరగనున్న రెండవ దశ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు 400 మందికి పైగా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు.

శనివారం చీరాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రవిజయలక్ష్మి సుబ్బారాయుడు కల్యాణ మండపంలో రెండవ దశ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ గారు ఎన్నికల విధులపై బ్రీఫింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లాలో జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, మొదటి దశ పంచాయతీ ఎన్నికలను పోలీస్ అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించారని అభినందించారు. అదే స్ఫూర్తితో ఈ నెల 29న జరగనున్న రెండవ దశ పంచాయతీ ఎన్నికలను కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుందని, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం మాత్రమే లోపలికి అనుమతించాలని, విధుల నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు.

ప్రతి పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో సున్నపు గీత ఏర్పాటు చేయించాలని, ఆ పరిధిలో ఎవరూ గుమిగూడకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఓటర్లు క్రమబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ, ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా చూడాలన్నారు.

ఎన్నికల విధుల్లో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమ మొబైల్ ఫోన్లలో సమర్థ్ మొబైల్ యాప్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రం వద్ద ఏదైనా సమస్య తలెత్తినప్పుడు యాప్‌లోని SOS బటన్‌ను నొక్కితే సమీపంలోని రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ పార్టీలు, స్పెషల్ స్ట్రైకింగ్ పార్టీలు, జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తక్షణ సమాచారం చేరుతుందన్నారు. అంతేకాకుండా SOS బటన్ నొక్కిన అనంతరం 30 సెకన్ల పాటు అక్కడి పరిస్థితులను వీడియో రూపంలో చిత్రీకరించి పంపే అవకాశం కూడా ఉందన్నారు. తద్వారా ఘటనా స్థలంలో నెలకొన్న పరిస్థితులను ఉన్నతాధికారులు తక్షణమే తెలుసుకుని, వేగవంతంగా ఆ ప్రదేశానికి చేరుకొని శాంతిభద్రతలు పరిరక్షించే అవకాశం ఉంటుందన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరి రియల్ టైమ్ లొకేషన్ ఆధారంగా విధుల పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.

పోలీస్ అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటూ, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బాపట్ల జిల్లాలో రెండవ దశలో భాగంగా చీరాల, వేమూరు నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాల్లో సుమారు 113 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున అన్ని మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని  తెలిపారు.

ప్రత్యేకంగా చీరాల నియోజకవర్గ పరిధిలోని చీరాల, వేటపాలెం మండలాల్లో 400 మందికి పైగా పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అదనంగా 8 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లు, 14 స్ట్రైకింగ్ ఫోర్స్‌లు, 20 రూట్ మొబైల్స్‌ను అందుబాటులో ఉంచామని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి, ఆయా కేంద్రాల వద్ద అదనపు పోలీస్ బలగాలను మోహరించామన్నారు.

ఈ నెల 29న జరగనున్న రెండవ దశ పంచాయతీ ఎన్నికలలో  ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా,  ప్రశాంతంగా వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ నుండి  పూర్తిస్థాయి భద్రత చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎవరూ విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో చీరాల, బాపట్ల డీఎస్పీలు ఎం.డి. మెయిన్, సీహెచ్. చంద్రమౌళి, ఎస్బీ సీఐ నారాయణ, ఎలక్షన్ సెల్ సీఐ సూర్యనారాయణ, చీరాల ఒకటవ పట్టణ, రెండవ పట్టణ, రూరల్ సీఐలు, బందోబస్తు విధుల నిర్వహణకు వచ్చిన ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.