BREAKING
దుర్గాలమ్మ ఆలయ నిర్మాణానికి రూ.50 వేలు విరాళం. అంగన్వాడీలకు ముగిసిన రెండో విడత శిక్షణ. చోరీ కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష. రణ్‌బీర్ కపూర్ 'రామాయణం' సినిమాపై మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ఆసక్తికర రివ్యూ! మేయర్ శ్రావణికి నీలబాబు అభినందన పిల్లల సమగ్ర అభివృద్ధిపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ విద్యతోనే అభివృద్ధి సాధ్యం. ఉచిత మెగా వైద్య శిబిరంలో 236 మందికి పరీక్షలు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ దంపతులు.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన కడెం వంశిత! అంగన్వాడీలకు పోషకాహారంపై అవగాహన తెల్ల బియ్యానికి బదులు ఎర్ర బియ్యం తింటే ఇన్ని లాభాలా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుతమైన ప్రయోజనాలు! త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు:మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేజర్ పంచాయితీ మనదే కావాలి... జాతీయ స్థాయి పోటీలకు పి ఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులు.. బోరవానిపేటలో కేంద్ర బృందం పర్యటన ఏర్పాట్లులను పరిశీలన

ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది.

Select Suryaa Now
ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది.

3,878 వార్డుల్లోనూ ఎన్నికలు...
ఈ నెల 13, 16 తేదీల్లో నోటిఫికేషన్  26, 29 తేదీల్లో పోలింగ్.....
జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్...
అమలాపురం మేజర్ న్యూస్ 
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. జిల్లాలోని 342 గ్రామ పంచాయతీలకు సర్పంచులు, 3,878 వార్డులకు వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ వెల్లడించారు. తొలి విడత ఎన్నికలు ఈ నెల 26న, రెండో విడత ఎన్నికలు 29న నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం ఈ నెల 13న తొలి విడతకు, 16న రెండో విడతకు నోటిఫికేషన్లు విడుదల చేయనుందని పేర్కొన్నారు.
ఇందుకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు
జిల్లాలోని 342 గ్రామ పంచాయతీలు, 3,878 వార్డులకు సంబంధించి ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ సామగ్రి సమీకరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ సూచించారు.