BREAKING
దివ్యాంగ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు పారాస్పోర్ట్స్ రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్ పోటీలు.. 16 వ వార్డు కార్పొరేటర్ ఏడువాక కు అభినందనలు - స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది వార్తలు ప్రసారం చేస్తే..నోటీసులిస్తారా?... పద్మావత్ షూటింగ్‌లో రణ్‌వీర్ సింగ్‌కు 24 సార్లు చెంపదెబ్బ.. రజా మురాద్ ఆసక్తికర వ్యాఖ్యలు త్రాగునీటి బోరును ప్రారంభించిన కార్పొరేటర్ కాకి గంగరాజు జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్ సెలక్షన్ పోటీల్లో 88 మంది క్రీడాకారులు ఎస్ఎస్టి టీం తో కలిసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వాహనాల తనిఖీలు. పార్వతీపురం జిల్లాలో ఉద్యోగులకు ఎన్నికల విధులను దూర ప్రాంతాలలో అధికారులు ఇష్టానుసారం వేయడం మానుకోవాలి.......ఎ పి టి ఎఫ్ 1938. 11వ వార్డు లో మోర్ ఎదురుగా ఫుట్ పాత్ పై ఉన్న అమ్ముతున్న కాయగూర లు ప్రజల్లో గుబులు ఓ సాథీ రే ట్రైలర్.. ప్రేమ అంటే నిలుపుకోవడమా లేక వదిలేయడమా అంటున్న ఇంతియాజ్ అలీ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది.. వైస్ చైర్మన్ ను సన్మానించిన వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తిచేయాలి ప్రజా హక్కులపై అవగాహనతోనే సమాజ అభివృద్ధి ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

Select Suryaa Now
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

సీతానగరం నవంబర్ 25 మేజర్ న్యూస్: జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం తన పర్యటనలో భాగంగా సీతానగరం మండలంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించి పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, సిబ్బందికి కల్పిస్తున్న సౌకర్యాలు, ఎన్నికల సామగ్రి పంపిణీకి చేపట్టిన చర్యలను పరిశీలించారు.
ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లపై ఆరా తీసారు. ఎన్నికల సిబ్బందికి విధుల కేటాయింపు, వారికి అవసరమైన ఎన్నికల సామగ్రి పంపిణీ, సంబంధిత రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు
ఎన్నికల సామగ్రి పంపిణీ సమయంలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని తెలిపారు, ప్రతి ఎన్నికల సిబ్బందికి కేటాయించిన సామగ్రి పూర్తిస్థాయిలో అందేలా చూడాలని, పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఇతర అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల విధుల నిర్వహణలో సమన్వయం, సమయపాలన ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియలో ప్రతి అంశాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూ. చ తప్పకుండ పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.