ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
గరుగుబిల్లి, నవంబర్ 25, మేజర్ న్యూస్:పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బుధవారం మండల పరిధిలోని పెద్దూరు, రావుపల్లి, కొత్తూరు, శివ్వాం, గొట్టివలస తదితర గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సంద ర్శించి, ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ సిబ్బందికి ఎస్ ఐ షేక్ ఫక్రుద్దీన్ తగు సూచనలు,సలహాలను అందజేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన సిబ్బందికి స్పష్టం చేశారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభం నుండి ముగిసే వరకు అప్రమత్తంగా వ్యవహ రించాలని సూచించారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, క్యూ లైన్ల నిర్వహణ, వృద్ధులు మరియు దివ్యాంగులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.అలాగే, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తే తక్షణమే పోలీసుల కు సమాచారం అందించాలని సిబ్బందికి సూచించారు.ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎస్ ఐ షేక్ ఫక్రుద్దీన్ కోరారు.