ప్రజా హక్కులపై అవగాహనతోనే సమాజ అభివృద్ధి
పార్వతీపురం, నవంబర్ 25, మేజర్ న్యూస్ : స్థానిక డాన్ బాస్కో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో మూడు రోజుల ‘పీపుల్స్ ఎంటైటిల్మెంట్స్’ శిక్షణ 55 మంది గిరిజన, గిరిజనేతర యువతీ యువకులతో బుధవారం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా డైరెక్టర్ ఫాదర్ సెల్వరాజ్ అరుళ్‌నాథన్ మాట్లాడుతూ ప్రజా హక్కులపై అవగాహనతోనే సమాజ అభివృద్ధి మరియు యువత బాధ్యతాయుతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర యువతకు ప్రభుత్వ పథకాలు, ప్రజా హక్కులు, సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక రక్షణ విధానాలపై అవగాహన కల్పించారు. యువత తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవడమే కాకుండా గ్రామాభివృద్ధిలో క్రియాశీలకంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇండియన్ సోషల్ ఇన్‌స్టిట్యూట్ – బెంగళూరు, సోషల్ ఇన్‌క్లూజన్ అండ్ డెమోక్రసీ విభాగం ఆధ్వర్యంలో నవంబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు బేసిక్ మాడ్యూల్–III ‘పీపుల్స్ ఎంటైటిల్మెంట్స్’ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత బాధ్యతాయుతంగా పాల్గొని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ మూడు రోజుల శిక్షణ ద్వారా కనీసం ఒక కొత్త విషయాన్ని నేర్చుకొని, దానిని తమ కుటుంబాలకు, గ్రామాలకు చేరవేయాలని కోరారు.డాన్ బాస్కో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ అనిల్ మాట్లాడుతూ యువతను ప్రోత్సహిస్తూ ఈ శిక్షణలో నేర్చుకున్న విషయాలను కేవలం తమకే పరిమితం చేయకుండా, సమాజంలోని ప్రజలకు చేరవేయాలని సూచించారు. శ్రీకాకుళం డయాసిస్ యువజన డైరెక్టర్ ఫాదర్ గుప్తా మాట్లాడుతూ యువతలో సామాజిక స్పృహ, నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందాలని, గ్రామీణ సమస్యల పరిష్కారంలో యువత ముందుండాలని కోరారు. యువత సామాజిక మార్పుకు నాయకత్వం వహించాలని, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఫాదర్ సురేష్ మాట్లాడుతూ యువతకు ప్రజా హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉండటం, వాటిని అర్హులైన ప్రజలకు చేరవేయడంలో చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరుణారావు, యువతీయువకులు పాల్గొన్నారు.