ఎంపీటీసీ రిజర్వేషన్ల జాబితా ప్రచురించిన అధికారులు
గరుగుబిల్లి, సూర్య : మండల ప్రాదేశిక సభ్యుల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ సెగ్మెంట్ల వారీగా రిజర్వేషన్ల జాబితాను నోటీసు బోర్డులో ప్రచురించడం జరిగిందని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఏవో నాలి అర్జునరావు పేర్కొన్నారు.మండల ప్రాదేశిక సెగ్మెంట్ల వారీగా రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. బురదవెంకటాపురం ఎంపీటీసీ స్థానం కు సంబంధించి అన్ రిజర్వుడుకు కేటాయించారు.అదే విధంగా ఉల్లిభద్ర ఎంపీటీసీ స్థానమును బీసీలకు కేటా యించగా కొత్తూరు ఎంపీటీసీ స్థానంను ఎస్ సి మహిళకు కేటాయించడం జరి గింది.పెదగుడబ ఎంపీటీసీ స్థానమును అన్ రిజర్వుడుకు కేటాయించగా తోటపల్లి ఎంపీటీసీ స్థానమును అన్ రిజర్వుడు మహిళకు కేటాయించారు. నాగూరు ఎంపీటీసీ స్థానం అన్ రిజర్వు డు మహిళ రావివలస (2) ఎస్ సి, గొట్టివలస ఎంపీటీసీ స్థానముకు సంబంధించి అన్ రిజర్వుడు మహిళకు కేటాయించగా చిన గుడబ ఎంపీటీసీ స్థానమును అన్ రిజర్వుడుకు కేటా యించారు.రావుపల్లి, రావివలస ఎంపీటీసీ స్థానాలను బీసీ మహిళకు కేటాయించారు.సంతోషపురం ఎంపీ టీసీ స్థానమును బీసీకి కేటాయించడం జరిగిందని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఏవో నాలి అర్జునరావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూ టీ ఎంపీడీవో మరడాన వెంకటేశ్వర రావు,కార్యాలయ సిబ్బంది బెంకిలి శ్రీనివాసరావు, గుంట్రేడ్డి కృష్ణప్రసాద్, అలజంగి శ్రీకాంత్, గంట విజయలక్ష్మి, డాకోజు సూర్యప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.