BREAKING
నల్లేరు కారం పొడితో కీళ్ల నొప్పులు పరార్.. ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయా? ప్రజల ఆశీస్సుల కొరకు టీడీపీ మీ ఇంటికి... గిత్త అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి సమాజంలో సుఖశాంతులు వెల్లివిరియాలి - ఎమ్మెల్యే కూనంనేని ఘనముగా సరస్వతీ పూజ ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డికి జూపల్లి ప్రమోద్ శుభాకాంక్షలు* ఓటర్ల తుది జాబితా పారదర్శకంగా ఉండాలి.... * ఎస్ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి దుర్గామాతను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సబ్జా గింజలతో బరువు తగ్గుతారా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే లక్కవరపుకోట మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై విమర్శలు! లాటరీ పద్ధతిన బార్ కేటాయింపు - మల్లు గారి రమేష్ గౌడ్ ఎంపిక - జిల్లా కలెక్టర్ కె. హరిత చక్కెర పరిశ్రమ, రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి మెగాస్టార్ చిరంజీవితో మల్టీస్టారర్ సినిమాపై నాగార్జున స్పందన.. టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ నిర్మల్ జిల్లా  అదనపు కలెక్టర్‌గా డి. వెంకట మాధవ రావు బాధ్యతల స్వీకరణ మున్సిపాల్టీల్లో నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం

ఎంపీటీసీ పోరుకు "వైసీపీ" సై

Select Suryaa Now
ఎంపీటీసీ పోరుకు "వైసీపీ" సై

గరుగుబిల్లి, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో గ్రామాల్లో రాజ కీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.ముఖ్యంగా గ్రామీణ స్థానిక సంస్థలైన ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని వై యస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదల తో ఉంది.అధికార కూటమిని దీటుగా ఎదుర్కొనేందుకు బలమైన తిరుగులేని అభ్యర్థులను రంగంలోకి దించేందుకు పక్కా వ్యూహంతో కసరత్తు ముమ్మరం చేశారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వస్తున్న మొదటి స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో వైయ స్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈఎన్ని కలను చాలెంజింగ్‌గా తీసుకుంది.గతం లో సాధించిన విజయాలను పునరావృతం చేయడమే లక్ష్యంగా... ప్రతి ఒక్క ఎంపీటీసీ స్థానంలోనూ అభ్యర్థులను నిలబెట్టి తీరాలని ఇప్పటికే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కేడర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.అధికార కూటమి పార్టీ కంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థుల ఎంపికలో వేగాన్ని పెంచింది. కేవలం మొక్కుబడి పోటీ కాకుండా, ఖచ్చితంగా గెలిచే వారికే సీట్లు కేటా యించాలని కురుపాం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి,జిల్లా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజులు భావిస్తున్నారు.మున్సిపల్ కార్పొ రేషన్లు, మున్సిపాలిటీలతో పాటు ప్రతిష్టాత్మకమైన మండల ప్రాదేశిక సభ్యులు,జిల్లా ప్రాదేశిక సభ్యుల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరి లోకి దూకేందుకు సర్వసన్నద్ధమైంది. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసి రేసులో ముందడుగు వేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం...ఇప్పుడు గ్రామీణ పోరుపై ప్రత్యేక దృష్టి సారిం చింది.ప్రతి ఎంపీటీసీ స్థానంలోనూ "ఢీ అంటే ఢీ" అనేలా దీటైన అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానిక నాయకత్వా నికి దిశ నిర్దేశం చేశారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎంపీటీసీ స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలమైన,దీటైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు స్థానిక నాయకత్వం ఆచి,తూచి అడుగులు వేయడం జరుగుతుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకు ని క్షేత్రస్థాయిలో ప్రజల్లో మంచి ఆదరణ బలమైన,సామాజిక సమీకరణాలు ఉన్న నేతలకే ఈసారి టిక్కెట్లు కేటా యించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు.

రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.