ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై రేపు రాజకీయ పార్టీల సమావేశం
రేణిగుంట మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రేణిగుంట మండలంలో రేపు (అక్టోబర్ 20) అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు రేణిగుంట మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయం నుంచి సోమవారం సర్క్యులర్ జారీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో సాధారణ ఎన్నికలు–2026కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం, తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 19 నుంచి జారీ కానున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అక్టోబర్ 20వ తేదీ ఉదయం 10 గంటలకు రేణిగుంట ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారి అధ్యక్షతన సమావేశం జరగనుంది. మండలంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలని అధికారులు సూచించారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
రేిపోర్టర్ : రమేష్ బాబు కొండల