BREAKING
నరసరావుపేటలో ఉద్రిక్తత.. వైసీపీ మహిళా అభ్యర్థిపై దాడి! మడకశిరలో కూటమి అభ్యర్థులకు భిఫారాల పంపిణీ నమీబియా వివాదాస్పద పెట్రోలియం బిల్లు చైనా మార్కెట్‌పై దక్షిణ ఆఫ్రికా చెర్రీల గురి దక్షిణ కొరియా సరిహద్దును తనిఖీ చేసిన ఉత్తర కొరియా ఆర్మీ చీఫ్ రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* తైవాన్ కార్మిక సంఘంతో మైక్రాన్ కీలక ఒప్పందం పోలీస్ అమరవీరుల త్యాగాలకు ఘన నివాళి..! అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీపీ రష్మి పెరుమాళ్ స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత పటిష్టం చేయాలి.. జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల వికారాబాద్ అభివృద్ధే లక్ష్యం.. ప్రజల సుభిక్షం కోసం అమ్మవారిని వేడుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టిన యువకుడు, కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు గురువులను గౌరవించడం భారతీయ సంస్కృతికి నిదర్శనం : విద్యావేత్త కృష్ణారెడ్డి ఘనంగా విజయదశమి వేడుకలు రేపల్లె జెడ్పీటీసీ బరిలో బీజేపీ అభ్యర్థి జుజ్జవరపు సురేష్‌ ఆత్మకూరులో పోలీస్ కవాతు

ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

Select Suryaa Now
 ఎంపీటీసీ ఎన్నికల  నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ :  స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా అనంతపురం రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ బుధవారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభమైంది. జడ్పిటిసి ఎన్నికలకు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు నామినేషన్లను స్వీకరిస్తున్నారు.  రూరల్  మండలంలో 36 ఎంపిటిసి స్థానాలకు ఈనెల 21 నుంచి 23 వరకు  వివిధ రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థులు వచ్చి నామినేషన్లు వేయనున్నారు . తొలి రోజు తొలి  నామినేషన్ ను రాచానపల్లి ఎంపిటిసి 1 టిడిపి అభ్యర్థి రమ్య ఎన్నికల ఆఫీసర్ నారాయణ స్వామికి అందజేశారు.   నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం వద్ద.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. రూరల్  సీఐ శ్రీకాంత్ యాదవ్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తును డిఎస్.పి కరుణాకర్ పర్యవేక్షించారు.  ఎన్నికల నామినేషన్ల విధులపై  ఎన్నికల  సిబ్బందికి ఏ ఆర్ ఓ దివాకర్  దిశా నిర్దేశం చేశారు.