ఎంపీ మిథున్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికిన తట్టి శ్రీనివాసులు రెడ్డి
మదనపల్లె : త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లె పట్టణంలో సోమవారం వైఎస్సార్సీపీ నాయకులతో నిర్వహించిన సమావేశానికి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ముందుగా తట్టివారిపల్లె సర్కిల్ వద్ద మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో అపూర్వస్వాగతం పలికారు.ఇందులో భాగంగా ఎంపీకి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా తట్టి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఎంపీ మిథున్ రెడ్డి ఎంతో సమర్థవంతమైన నేత అని,ఆయన నేతృత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు.కార్యకర్తల సంక్షేమానికి పెద్దిరెడ్డి కుటుంబం ముందు వరుసలో ఉంటుందన్నారు.ఎంపీ మిథున్ రెడ్డి,సమన్వయకర్త నిస్సార్ అహమద్ సారధ్యంలో సమిష్టిగా పనిచేసి మదనపల్లి మున్సిపాలిటీని మరోసారి కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య,రెడ్డి సంఘం నాయకులు మాధవరెడ్డి,సాంబశివారెడ్డి,ఆవుల సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.