ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక
యద్దనపూడి, మేజర్‌న్యూస్ :
యద్దనపూడి మండలం వింజనంపాడు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.వారికి ఎమ్మెల్యే ఏలూరి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తూ ప్రజా పాలన అందిస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పర్చూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.
టీడీపీలో చేరిన వారిలో.. పల్లెపోగు గోపి, సుహాసిని, సునీత, రోజా, గరికపూడి నాగమ్మ, వెంకయ్య, ఆదాము, స్వామి (మరియదాసు), సుకన్య, పరమగీతం, యేసుదాసు, కోటమ్మ, వినయ్, అక్కమ్మ, ఈదార సుబ్బాయమ్మ, వంకాయలపాటి సుబ్బారావు, శ్యాంబాబు, అచ్చమ్మ, యేసుదయమ్మ, నాగేశ్వరరావు, అరిముల్ల పండు, పసుమర్తి రత్నకుమారి ఉన్నారు. వీరితో పాటు వారి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో యద్దనపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,ఎంపీపీ తారక రామారావు, తెలుగుదేశం సర్పంచ్ అభ్యర్థి కొండముమూడి సుబ్బాయమ్మ,నాయకులు సాదినేని సుధీర్, వజ్జా సుబ్బయ్య, తూబాటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.