BREAKING
పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు

ఏలూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

Select Suryaa Now
ఏలూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

ఏలూరు, మేజర్ న్యూస్: రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని కోరుతూ గత కొన్ని రోజులుగా ఏలూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే.సీతారామారావు మాట్లాడుతూ ఇటీవల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న న్యాయవాదులపై  జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న దాడులను ఖండించారు. దీనిపై త్వరలోనే న్యాయశాఖ మంత్రికి వినతిపత్రాన్ని సమర్పిస్తామని తెలిపారు. ఈనెల 9వ తేదీ వరకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం తప్పనిసరిగా ఏర్పాటు చేసే విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నిమ్మల.జ్యోతి కుమార్ మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయని, వీటన్నిటిని అరికట్టే విధంగా న్యాయవాదుల యాక్ట్ అమలు చేసేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ రిలే నిరాహార దీక్షలో అధిక సంఖ్యలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. దీక్షలో అడ్వకేట్లు ఏలూరు.వెంకటేశ్వరరావు, ఎం.కృష్ణారావు, పి.ఎ.విజయానంద్, కె.కృష్ణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

 పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్