BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

ఏడు రాష్ట్రాలు, పుదుచ్చేరి, రెండు విదేశాల కళాకారుల ప్రదర్శనలు 16 కళాబృందాలు.. 451 మంది కళాకారులతో మాడవీధుల్లో సాంస్కృతిక సందడి

Select Suryaa Now
ఏడు రాష్ట్రాలు, పుదుచ్చేరి, రెండు విదేశాల కళాకారుల ప్రదర్శనలు  16 కళాబృందాలు.. 451 మంది కళాకారులతో మాడవీధుల్లో సాంస్కృతిక సందడి

తిరుపతి, మేజర్ న్యూస్ :తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం నిర్వహించిన గజ వాహనసేవలో దేశవిదేశాల కళాకారులు తమ సంప్రదాయ నృత్యాలు, జానపద కళారూపాలతో భక్తులను పరవశింపజేశారు. శ్రీ మలయప్పస్వామివారి వైభవానికి కళా నీరాజనాలు అర్పిస్తూ తిరుమల మాడవీధులను భక్తిరసంతో, సాంస్కృతిక వైభవంతో పులకింపజేశారు.

విదేశాల్లోనూ వెల్లివిరిసిన భారతీయ కళా వైభవం....
ఖతర్ కళాకారులు భరతనాట్యం, దుబాయ్ కళాకారులు కూచిపూడి ప్రదర్శనలతో భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలను చాటగా, పుదుచ్చేరి కళాకారులు కరగట్టం నృత్యంతో ఆకట్టుకున్నారు.

వైవిధ్యభరిత జానపద కళారూపాలు....
ఆంధ్రప్రదేశ్ కళాకారుల లంబాడీ నృత్యం, మహారాష్ట్ర కళాకారుల లెజిమ్స్, కర్ణాటక కళాకారుల గజేంద్ర మోక్షం నృత్యరూపకం, మధ్యప్రదేశ్ కళాకారుల కథక్, పంజాబ్ కళాకారుల భాంగ్రా ప్రదర్శనలు భక్తులను విశేషంగా అలరించాయి.

16 కళాబృందాల్లో 451 మంది కళాకారులు
ఈ సేవలో టీటీడీకి చెందిన నాలుగు ప్రాజెక్టుల నుంచి మొత్తం 16 కళాబృందాల్లో 451 మంది కళాకారులు పాల్గొన్నారు. హిందూ ధార్మిక ప్రాజెక్టు నుంచి 161 మంది, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల నుంచి 93 మంది, దాససాహిత్య ప్రాజెక్టు నుంచి 114 మంది, అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి 81 మంది కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.
భక్తి, సంప్రదాయం, జానపద కళల సమ్మేళనంగా గజ వాహనసేవ భారతీయ సంస్కృతీ వైభవాన్ని చాటుతూ భక్తులకు కనువిందు చేసింది.

H. Dwaraka, staff reporter, tpt.
Cell no : 9705347341