దివ్యాంగులను హేళన చేయకూడదు.. ప్రేమతో చూసుకోవాలి
మక్కువ, నవంబర్ 25, ( మేజర్ న్యూస్):-
దివ్యాంగుల పట్ల హేళన భావంతో చూడకుండా.. వారి పట్ల ప్రేమాభిమానాలతో ఆదరించాలని హోలీ క్రాస్ డైరెక్టర్ సిస్టర్ ప్రియాంక కోరారు. బుధవారం మండలంలో మక్కువ సమీపంలో గల డబ్బురు వలస హోలీ క్రాస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మక్కువ, బొబ్బిలి, సాలూరు మండలాలకు చెందిన 30 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగుల పట్ల ప్రామాభిమానాలతో ఆప్యాయంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన రాయిడు శంకర్రావు మాట్లాడుతూ.. దివ్యాంగులు ప్రభుత్వం అందిస్తున్న హక్కుల తో పాటు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, పథకాల గూర్చి ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా 30 మంది దివ్యాంగులకు సుమారు 85 వేల రూపాయలు విలువచేసే ట్రై సైకిల్స్ అందజేశారు. కార్యక్రమంలో దివ్యాంగుల సెక్టార్ పరిశీలికలతో పాటు కల్పనా సిస్టర్,రమా సిస్టర్ లెమన్సీ సిస్టర్ తో పాటు తల్లిదండ్రులు దివ్యాంగ విద్యార్థులు పాల్గొన్నారు.