డివిజన్ అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యత: కార్పొరేటర్ ఖాజా వలి షేక్ ప్రజా ఆరోగ్యమే మా లక్ష్యం: 46వ డివిజన్ కార్పొరేటర్
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : ప్రజా ఆరోగ్యమే తమ ప్రథమ ప్రాధాన్యమని 46వ డివిజన్ కార్పొరేటర్ ఖాజా వలి షేక్ ఉద్ఘాటించారు. డివిజన్‌ను స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన ప్రాంతంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఆయన నిత్యం ప్రజల మధ్యే ఉంటూ సేవలు అందిస్తున్నారు.
ఇందులో భాగంగా ఈరోజు డివిజన్‌లో ప్రత్యేకంగా పారిశుధ్య పనులను చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మురుగునీటి పారుదల, చెత్త తొలగింపు వంటి పనులను ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఖాజా వలి షేక్ మాట్లాడుతూ.. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపగలరని తెలిపారు. స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన 46వ డివిజన్‌ను నిర్మించడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
"ప్రజా సేవే నా బాధ్యత… పరిశుభ్రతే మనందరి ప్రాధాన్యత" అని ఆయన పేర్కొంటూ, డివిజన్ అభివృద్ధికి ప్రజలందరి సహకారం ఎంతో కీలకమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజలు కార్పొరేటర్ చేపడుతున్న చొరవను అభినందిస్తున్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్