డిసెంబర్ 4న తిరుమ రానున్న ప్రధాని మోదీ
తిరుపతి:తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) ప్రాంగణంలో డిసెంబర్ 4 నుంచి 6 వరకు మూడు రోజుల పాటు అఖిల భారత డీజీపీలు, ఐజీపీల వార్షిక సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత పోలీస్ అధికారులు హాజరుకానున్నారు. జాతీయ భద్రత, సైబర్ నేరాల నిరోధం, డ్రగ్స్ నియంత్రణ మరియు అంతర్రాష్ట్ర పోలీస్ సమన్వయంపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించనున్నారు. కాగా, సదస్సులో పాల్గొనే పోలీసు అధికారుల మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం కోసం కేంద్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ప్రత్యేక యోగా మరియు ధ్యాన కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
PM Modi & Amit Shah to Attend National DGP-IGP Conference
ఈ వీడియో డిసెంబర్ 4 నుంచి తిరుపతిలో జరిగే జాతీయ డీజీపీ-ఐజీపీ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కావడంపై మరింత వివరమైన సమాచారాన్ని అందిస్తుంది.