డి శిర్లాం లో హోరెత్తిన వైసిపి ప్రచారం
మక్కువ, సూర్య : మక్కువ మండలంలో శివారు గ్రామమైన డి శిర్లాం వైసిపి జన ప్రభంజనంతో జనసంద్రమైంది. ఆదివారం గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు మావుడి రంగునాయుడు, మావుడి శ్రీనివాసరావుల సారధ్యంలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న మావుడి సోదరులకు అక్కడ ప్రజల బ్రహ్మరథం పట్టారు. గడపగడపకు ప్రచారంలో భాగంగా జనం నీరాజనాలు అభిమానం పార్టీ నాయకులకు అందిస్తూ , అడుగడుగున స్వాగతం పలుకడం అక్కడ ప్రజలకు వైసీపీ నాయకత్వంపై , వైఎస్ఆర్సిపి పార్టీపై ఉన్న అభిమానానికి నిదర్శనంగా నిలుస్తుంది. గడపగడపకు ప్రచారంలో భాగంగా గ్రామమంతా వైసీపీ జెండాలు మోస్తున్న అభిమానులతో జనసంద్రం కావడం విశేషం. గ్రామంలోకి అడుగట్టిన వైసీపీ నాయకులను ఆదరిస్తూ ఇక్కడ వైసిపి అభిమానులు ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం అక్కడ వైసిపి విజయాన్ని గుర్తు చేస్తుంది. వైసిపి బలపరిచిన ఎంపీటీసీ , జడ్పిటిసి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మండల వైసీపీ నాయకులు మావుడి రంగునాయుడు, మావుడి శ్రీనివాసరావు లు ప్రచారం సాగించారు.