దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ స్వామి వారి ఆలయంలో వరుణ జపం, పూర్ణాహుతి కార్యక్రమాలు
దెందులూరు, మేజర్ న్యూస్ : రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాలు నిండి, రైతాంగం పాడిపంటలతో సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దెందులూరు మండలం సానిగూడెం గ్రామంలోని సీతారామ స్వామి వారి దేవస్థానంలో మంగళవారం వరుణ యాగం, వరుణ జపం మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి ఆలయ అర్చకులు, ధర్మకర్తలు, కూటమి నాయకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తలపాగా చుట్టి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్థానిక నాయకులు అలపాటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ యాగశాలకు చేరుకుని హోమంలో పాల్గొని శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూఎల్-నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, రాష్ట్రం అంతటా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలనే సదుద్దేశంతో ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లోని ప్రధాన దేవాలయాల్లో వరుణ యాగాలు నిర్వహిస్తోందని తెలిపారు.ఇటీవల కురిసిన వర్షాలతో చెరువుల్లోకి నీరు చేరినప్పటికీ, రాబోయే రోజుల్లో పంటలకు ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా వర్షాలు కురిసి రైతన్నల కళ్లల్లో ఆనందం వెల్లివిరియాలని భగవంతుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు నాగనబోయిన సత్యనారాయణ , కార్యదర్శి కసుకుర్తి రామకృష్ణ , సీతంపేట సొసైటీ చైర్మన్ యలమర్తి వీర వెంకట సత్యనారాయణ , నీటి సంఘం అధ్యక్షులు యలమర్తి శ్రీనివాసరావు , లక్ష్మీపురం మాజీ సర్పంచ్ మేక కనకరాజు , బీసీ సెల్ జిల్లా నాయకులు ఇప్పిలి వెంకటేశ్వరరావు ( వైవిఆర్) , కూటమి నాయకులు బాయి రామ్ ప్రసాద్ , మోహన్ రావు గారు, ఆలయ అధికారులు, ధర్మకర్తలు, స్థానిక కూటమి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
న్యూస్ బ్యూరో బాల సౌరి ఏలూరు జిల్లా