BREAKING
అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు.. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు.. సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ ఐసీసీ నిబంధనల ఉల్లంఘన.. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అఫ్సర్‌పై అధికారిక మందలింపు!

దౌర్జన్యాలకు తావులేదు.. ప్రజాస్వామ్యమే మన బాట

Select Suryaa Now
దౌర్జన్యాలకు తావులేదు.. ప్రజాస్వామ్యమే మన బాట


.. స్థానిక ఎన్నికల్లో విజయమే మన మాట!

- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

*గొడ్డలి పార్టీ రాజకీయ వేధింపులను మర్చిపోవద్దు

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలవాలి

నందిగాంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి  దిశానిర్దేశం


నందిగాం, :రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నందిగాం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. గత రాజకీయ పరిణామాలను గుర్తుచేస్తూ, గత ఐదేళ్ల పాలనలో గ్రామాలు అభివృద్ధికి దూరమయ్యాయని విమర్శించారు. గతంలో ఎదురైన రాజకీయ వేధింపులు, దాడులు, బెదిరింపులను మర్చిపోకుండా, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల విశ్వాసంతో అన్ని స్థానాల్లో విజయం సాధించేలా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నందిగాం ప్రాంతంలో సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేశామని, 2027 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టుకు రూ.20 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు. అలాగే, కోటబొమ్మాళిలో పార్టీకి మరింత గౌరవం తెచ్చేలా బ్రహ్మాండమైన మండల పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు.

గొడ్డలి పార్టీ ఐదేళ్ల పాలనలో గ్రామాలు అభివృద్ధికి దూరం

నందిగాం మండలం విస్తారమైన ప్రాంతమని, అనేక గ్రామాలతో కూడిన ఈ ప్రాంతంలో ప్రజలు ఇప్పటికీ పలు మౌలిక సదుపాయాల సమస్యలను ఎదుర్కొంటున్నారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గత ఐదేళ్ల పాలనలో గ్రామాల అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం, అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారించాల్సి ఉండగా, గత పాలకులు ప్రజల అవసరాలను విస్మరించారని అన్నారు. గుదేశం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా భావించాలని సూచించారు.

 గొడ్డలి పార్టీ రాజకీయ వేధింపులను మర్చిపోవద్దు

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి గుర్తుచేశారు. పోలీసు కేసులు, దాడులు, బెదిరింపుల కారణంగా పార్టీ శ్రేణులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకునేలా ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఎన్నికలకు ముందు తనపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించినా వెనక్కి తగ్గలేదని, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేశానని చెప్పారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేశానని, నందిగాం ప్రాంతానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయినా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించానని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టువిడవకుండా పనిచేయడం వల్లే 2024 ఎన్నికల్లో నందిగాం మండలంలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ సాధించిందని తెలిపారు. ఒకప్పుడు పార్టీకి అనుకూల పరిస్థితులు లేని ప్రాంతంలో ఈ స్థాయికి చేరుకోవడం కార్యకర్తల సమష్టి కృషికి నిదర్శనమని అన్నారు.

స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేద్దాం

స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామీణ ప్రజలకు అత్యంత కీలకమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. స్థానిక సంస్థల ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనుల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని చెప్పారు.గతంలో స్థానిక ఎన్నికల సమయంలో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, బెదిరింపులకు పాల్పడటం, పోలింగ్ సమయంలో దాడులు చేయడం, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయని గుర్తుచేశారు. అలాంటి పరిణామాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

గతంలో ప్రత్యర్థులు వ్యవహరించిన విధంగానే మనం కూడా వ్యవహరిస్తే, ప్రజాస్వామ్య పార్టీకి, ఇతర పార్టీలకు మధ్య తేడా ఏముంటుందని ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడం, నామినేషన్లను అడ్డుకోవడం వంటి చర్యలకు తావులేకుండా ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని సూచించారు.

వంద శాతం స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యం

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సహా అన్ని స్థానాల్లో విజయం సాధించే లక్ష్యంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజల ప్రేమ, విశ్వాసాన్ని పొందడం ద్వారానే ఎన్నికల్లో విజయాలు సాధించాలని స్పష్టం చేశారు.

ప్రతి గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

2027 జూన్ నాటికి ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పూర్తి చేస్తాం

నందిగాం ప్రాంతంలో సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే తమ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులకు రూ.20 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, 2027 జూన్ నాటికి ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌ను పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టు పూర్తయితే నందిగాం ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లో సాగునీటి సమస్యలకు ఉపశమనం లభిస్తుందని, రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.

ప్రజల విశ్వాసంతోనే శాశ్వత విజయం

రాజకీయాల్లో విజయం సాధించడానికి దౌర్జన్యాలు, బెదిరింపులు మార్గం కాదని, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసేవ, ప్రజల విశ్వాసమే అసలైన బలమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గతంలో ఎదురైన రాజకీయ ఇబ్బందులను గుర్తుంచుకుంటూనే ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో ప్రతి నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని, సమష్టి కృషితో నందిగాం మండలంలో తెలుగుదేశం పార్టీ విజయపతాకాన్ని ఎగురవేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులు,అజయ్ కుమార్, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.