దర్శి లో వైసీపీ నాయకుల బరితెగింపు.
1500 మందితో నామినేషన్ కేంద్రాల వద్దకు వెళ్ళటానికి ప్రయత్నం.
అడ్డుకున్న పోలీసులపై దాడి.
దర్శి ఎస్ఐ ఏడుకొండలకు తీవ్ర గాయాలు.
సూర్య న్యూస్ దర్శి. దరిశి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ సందర్భంగా వైసీపీ నాయకులు బరితెగింపు తెగబడ్డారు. సుమారు 1500 మంది వైసీపీ జండాలు పట్టుకొని నినాదాలతో నామినేషన్ కేంద్రాల వద్దకు వెళ్లటానికి ప్రయత్నించారు. నామినేషన్ కేంద్రాల వద్దకు ఎంతమంది వెళ్లటానికి వీలులేదని దరిశి డిఎస్పి బాలమురళీకృష్ణ తెలిపారు అయినా ఆయన మాట పట్టించుకోకుండా పోలీసులతో వైసిపి నాయకులు వాగ్వివాదం నికి దిగారు. పోలీసులు అభ్యర్థితో పాటు బలపరిచే అభ్యర్థులు మాత్రమే నామినేషన్ కేంద్రాల వద్దకు వెళ్లి నామినేషన్ వేయాలని కోరినప్పటికీ వినకుండా పోలీసులపై మాటల యుద్ధానికి తెర లేపారు. భారీగా జనాన్ని జన వెళ్ళటానికి లేదని పోలీసులు చెప్పడంతో వారిపై దాడికి దిగారు. ఈ సంఘటనలో దర్శి ఎస్ఐ జి ఏడుకొండలు మరొక కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఎస్సై ఏడుకొండలు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దర్శి లో పోలీసులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడం తీవ్ర కలకలం రేపింది శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు పైనే రాజకీయ వ్యక్తులతో దాడికి దిగడం ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారబోతుందని ఈ అరాచకాలను తీవ్రంగా ఖండించాలని ప్రజలు అంటున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ప్రజల కోరుతున్నారు.