చివరి దశ డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం ------------------------------------ సబ్జెక్ట్:ఏ ఆర్ కే వన్,ఫోటో రైట్ అప్,విలేకరులతో మాట్లాడుతున్న కళాశాల ప్రిన్సిపాల్ కుసుమకుమారి ------------------------------------ అరకులోయ, అక్టోబర్ 15, మేజర్ న్యూస్: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చివరి దశ డిగ
చివరి దశ డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
అరకులోయ, స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చివరి దశ డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.కుసుమకుమారి తెలిపారు.స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఆమె విలేకరులతో గురువారం మాట్లాడుతూ విద్యార్థినులకు ఓఏఎండిసి–2026 మూడో విడత డిగ్రీ ప్రవేశాల వివరాలు తెలియజేశామన్నారు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థినులు బీఏ,బీకాం,బీఎస్సీ,బీబీఏ, బీసీఏ,బీపీఏ,బీఎఫ్ఏ తదితర డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు అర్హులని ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 24వ తేదీ నుంచి ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు,రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల ఆన్లైన్ వెరిఫికేషన్,వెబ్ ఆప్షన్ల వంటి ప్రక్రియ ప్రారంభం కానుందని ఆమె చెప్పారు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు,షెడ్యూల్ కోసం విద్యార్థినులుఅధికారిక వెబ్సైట్ను సందర్శించి,నిర్ణీత గడువులోగా ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేసుకుని ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు.అదేవిధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు పరీక్షల రిజిస్ట్రేషన్ గడువు పొడిగించినట్లు ఆమె తెలిపారు.విశ్వవిద్యాలయం విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం, బీఏ,బీఎస్సీ,బీకాం తదితర డిగ్రీ కోర్సుల విద్యార్థినులు అపరాధ రుసుము లేకుండా పరీక్షల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆమె వివరించారు.2,000 రూపాయల అపరాధ రుసుముతో అక్టోబర్ 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు,అదనంగా రోజుకు 100 రూపాయలు చెల్లించి అక్టోబర్ 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందని ఆమె తెలిపారు.పరీక్షల రిజిస్ట్రేషన్కు అక్టోబర్ 16వ తేదీ చివరి తేదీ కాగా,చలానా చెల్లింపునకు అక్టోబర్ 17వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారని ఆమె పేర్కొన్నారు.ఇప్పటికే ప్రకటించిన థియరీ, ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని ఆమె తెలిపారు.ఈ మేరకు విద్యార్థినులు ఓఏఎండిసి ప్రవేశాల షెడ్యూల్తో పాటు పరీక్షల రిజిస్ట్రేషన్ గడువులను కూడా గమనించి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సంబంధిత ప్రక్రియలను నిర్ణీత తేదీల్లోగా పూర్తి చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.కుసుమకుమారి సూచించారు.మరిన్ని వివరాల కోసం కళాశాల కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు.