BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

చిత్తూరులో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ - నగర నాయకత్వం  వైకాపాలోకి జంప్ - మాజీ నగర అధ్యక్షుడు తుంగా నరేష్ చౌదరి సహా ఐదుగురు కీలక నేతల పార్టీ మార్పు - ఎం.సి. విజయానందరెడ్డి సమక్షంలో కండువాలు

Select Suryaa Now
చిత్తూరులో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్   - నగర నాయకత్వం  వైకాపాలోకి జంప్  - మాజీ నగర అధ్యక్షుడు తుంగా నరేష్ చౌదరి సహా ఐదుగురు కీలక నేతల పార్టీ మార్పు   - ఎం.సి. విజయానందరెడ్డి సమక్షంలో కండువాలు
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
చిత్తూరు నగరపాలక సంస్థ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నగరంలో పార్టీని నడిపించిన కీలక నాయకులు ఒకేసారి పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కలకలం రేపుతోంది.
చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎం.సి. విజయానందరెడ్డి సమక్షంలో ఆదివారం ఈ చేరికల కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ మాజీ నగర అధ్యక్షుడు తుంగా నరేష్ చౌదరి, ఎస్సీ విభాగ అధ్యక్షుడు రవి, యూనిట్ ఇన్చార్జి తుంగా వినోద్ చౌదరి, 50వ డివిజన్ అధ్యక్షుడు మంజేష్ కుమార్ అలియాస్ కుట్టి, 50వ వార్డు ఎస్సీ విభాగ నాయకుడు సుందర్ తమ అనుచరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎం.సి. విజయానందరెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తుంగా నరేష్ చౌదరి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు, నాయకులకు గౌరవం లేదని, నగరంలో నాయకత్వం సరైన దిశలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ నాయకత్వం, ఎం.సి. విజయానందరెడ్డి పనితీరు నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఎం.సి. విజయానందరెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి తగిన గౌరవం, ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. వారి రాకతో నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని, రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.