BREAKING
కైరోలో అడుగుపెట్టిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం నూతన మండల కమిటీ ఎన్నిక సర్పంచ్ పీఠంపై సమరం.. భవిష్యత్తు రాజకీయాలకు సమయం! ఎల్లసిరిలో పల్లెపోరు.. పార్టీల రాజకీయ భవితవ్యానికి పరీక్ష! శివకేశవులకు ప్రీతిపాత్రమైన కోటి సోమవారం సోమలాపురం పంచాయతీ తెదేపా మద్దతు దారు సర్పంచి అభ్యర్థి మొండి గీతమ్మ నామినేషన్ దాఖలు శ్రీకాళహస్తి ఎంజీఎం హాస్పిటల్ మెడికల్ క్యాంపు - డైరెక్టర్ గుడ్లూరు మయూర్ నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి! హులికల్లు పంచాయతీ బరిలో తెదేపా మద్దతారు సర్పంచ్ అభ్యర్థి వాల్మీకి తిప్పేస్వామి నామినేషన్ దాఖలు పింగుల మధుకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ అవార్డు-2026 రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం చలో ఢిల్లీ కార్మికుల కార్యక్రమాన్ని జయప్రదం చేయండి! క్రీడాకారులను ప్రోత్సహించాలి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి: కాటా శ్రీనివాస్ గౌడ్ ఓటీటీలోకి రాబోతున్న టాలీవుడ్ హారర్ థ్రిల్లర్ '418'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? కుందుర్తి సర్పంచ్ అభ్యర్థిగా గార్మెంట్ గోపాల్ మానవ సేవే.. సాయికి నిజమైన నివాళి

చలో ఢిల్లీ కార్మికుల కార్యక్రమాన్ని జయప్రదం చేయండి!

Select Suryaa Now
చలో ఢిల్లీ కార్మికుల కార్యక్రమాన్ని జయప్రదం చేయండి!

చలో ఢిల్లీ కార్మికుల కార్యక్రమాన్ని జయప్రదం చేయండి!

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

డిసెంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి. అంజిబాబు పిలుపునిచ్చారు. సీఐటీయూ ఓర్వకల్లు మండల కార్యదర్శి జి. శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

పారిశ్రామిక ప్రాంతమైన ఓర్వకల్లు హబ్‌లోని జయరాజ్ స్టీల్ ప్లాంట్ కార్మికులను కలిసి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఓర్వకల్లు బస్టాండ్ వద్ద చలో ఢిల్లీ పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 29 పాత కార్మిక చట్టాలను రద్దు చేసి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు నెలకు రూ.42 వేల కనీస వేతనం అమలు చేయాలని, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కుకు భంగం కలిగించే ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు వి. సుధాకర్, కార్తీక్, చంద్రకాంత్, లక్ష్మన్న, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.