చైర్మన్ పీఠానికి టీడీపీ రెబల్ అభ్యర్థిగా మన్యాల రమ్య నామినేషన్.
పదవులు లేకున్నా ప్రజాసేవలోనే ఉన్నా - మన్యాల శ్రీనివాస్
పలాస, అక్టోబర్ 18, మేజర్ న్యూస్.
పలాస మున్సిపల్ చైర్మన్ పదవికి టీడీపీ రెబల్ అభ్యర్థిగా మన్యాల శ్రీనివాస్ యాదవ్ భార్య మన్యాల రమ్య ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కరోనా కష్టకాలం నుంచి నేటి వరకు పేదలకు నిత్యవసర సరుకులు అందించడంతో పాటు ఆర్థిక సహాయం చేస్తూ వస్తున్నానన్నారు. ఎటువంటి పదవులు లేకపోయినా ప్రజాసేవలోనే ఉన్నానని, చైర్మన్ గా విజయం సాధించి మరింత సేవ చేయాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నానన్నారు.
పార్టీ గుర్తించలేదు.. అందుకే స్వతంత్రంగా పోటీ..
స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు, గౌతు శివాజి వద్ద రాజకీయ నిబద్ధతను గమనించి, వారి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఏడాది నుంచి చైర్మన్ గా పోటీ చేస్తానని ప్రకటిస్తున్నా పార్టీ గుర్తించకపోవడంతో అనివార్య కారణాల వల్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు.తమ సేవలను గుర్తించి ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.