బంగారెడ్డిపల్లి, ఆనగల్లులో కూటమి సందడి . కంచర్ల ప్రతిమ రాకతో జోష్ పెంచిన కార్యకర్తలు - గడప గడపకు తిరిగిన ఎంపీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి మంజుల శశికర్ బాబు. .మహిళల హారతులతో స్వాగతం.
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
చిత్తూరు మండలం బంగారెడ్డిపల్లి, ఆనగల్లు గ్రామాల్లో మంగళవారం కూటమి నాయకులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎమ్మెల్యే సతీమణి కంచెర్ల ప్రతిమ పాల్గొని ప్రచారం చేశారు.
ముత్తుకూరు ఎంపీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి మంజుల శశికర్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి వీధి, ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేశారు. ఎమ్మెల్యే సతీమణి ప్రతిమ గ్రామంలో మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
తల్లికి వందనం, ఉచిత బస్సు, దీపం పథకం, రైతు భరోసా వంటి పథకాల ద్వారా ప్రతి కుటుంబం లబ్ధి పొందుతోందని ప్రతిమ తెలిపారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని చెప్పారు.
గ్రామంలో తాగునీటి కొరత, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల సమస్యలను తాము గెలిచాక పరిష్కరిస్తామని ఎంపీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు హామీ ఇచ్చారు. జడ్పీటీసీ అభ్యర్థి మంజుల శశికర్ బాబు మాట్లాడుతూ మహిళా సాధికారతకు తాము కృషి చేస్తామని తెలిపారు.
బంగారెడ్డిపల్లిలో మహిళలు ప్రతిమకు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రతిమ తెలిపారు. తమకు అవకాశం ఇస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అభ్యర్థులు తెలిపారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మోహన్ రాజ్, ఎంపీపీ సునీత, జయచంద్ర నాయుడు, స్థానిక ఎంపీటీసీ అభ్యర్థులు నవనీత, లావణ్య, రఘు, మేశాక్, ముత్తుకూరు మోహన్, గిరి, రాము, నీలకంఠ నాయుడు, రెడ్డప్ప, ఐరాల మాజీ జడ్పీటీసీ సుచిత్ర కన్నయ్య నాయుడు, కంద స్వామి, రమేష్, ప్రిన్స్, శరవణ, మైకేల్, టీడీపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్