BREAKING
అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.. నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లు నేటి రాశి ఫలాలు: 6 అక్టోబర్ 2026 (మంగళవారం) రాజ్‌కుమార్ సేవా స్ఫూర్తి చిరస్మరణీయం : ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నేటి పంచాంగం: 6 అక్టోబర్ 2026 (మంగళవారం) ఖరీఫ్ ధాన్యం సేకరణకు పటిష్ట ప్రణాళిక

భోగాపురం విద్యుత్ అవసరాలపై ప్రత్యేక దృష్టి

Select Suryaa Now
భోగాపురం విద్యుత్ అవసరాలపై ప్రత్యేక దృష్టి

భోగాపురం విద్యుత్ అవసరాలపై ప్రత్యేక దృష్టి

విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలి: మంత్రి గొట్టిపాటి రవికుమార్

భోగాపురం విమానాశ్రయానికి విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలి: మంత్రి గొట్టిపాటి రవికుమార్

ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి : 

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన విద్యుత్ శాఖ అధికారులు హాజరయ్యారు. రెండు జిల్లాల పరిధిలో కొనసాగుతున్న వివిధ విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ సరఫరా పరిస్థితిపై అధికారులతో మంత్రి చర్చించారు. అభివృద్ధి చెందుతున్న భోగాపురం ప్రాంతంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో పెరగనున్న పారిశ్రామిక అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఇరు జిల్లాల పరిధిలో పీఎం సూర్యఘర్ పథకం పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. సూర్యఘర్, ఆర్డీఎస్ఎస్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.