భగవద్గీత పోటీల్లో సుధాకర్ ఐడియల్ విద్యార్థుల ప్రతిభ
విజయవాడ, మేజర్ న్యూస్: విజయవాడ చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత పోటీల్లో సుధాకర్ ఐడియల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. ఈ పోటీల్లో విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కైవసం చేసుకుని పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు. భగవద్గీత శ్లోకాల పఠనం, వాటిపై అవగాహన, ఉచ్చారణలో తమ ప్రతిభను చాటుతూ బహుమతులు సాధించడం పట్ల ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. విజేతలైన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.