బీఫామ్ అందజేసిన వైసీపీ మేయర్ అభ్యర్థి విజయ్ కుమార్ రెడ్డి
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్: నెల్లూరు నగరపాలక సంస్థ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి బుధవారం బీఫామ్ పత్రాలను అందజేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం. వెంకటేశ్వర్లుకు ఆయన బీఫామ్ పత్రాలను సమర్పించారు. మేయర్ అభ్యర్థిగా పార్టీ తరఫున పోటీ చేసేందుకు అవసరమైన బీఫామ్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేయడంతో ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది.