బలవంతపు ఏకగ్రీవాలను ప్రజలు తిప్పికొట్టాలని
రేపల్లె, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలను ప్రజలు తిప్పికొట్టాలని, ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి పిలుపునిచ్చారు. ఆదివానం పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో పార్టీ సభ్యులు, సానుభూతిపరులతో నిర్వహించిన జనరల్‌బాడీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా రేపల్లె మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా సీపీఎం నేత సీహెచ్.మణిలాల్, చైర్పర్సన్ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత రామనాథం అనూషకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.