బాపట్లలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లు ప్రారంభం
బాపట్ల, మేజర్ న్యూస్:;జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా బాపట్ల మండల పరిషత్ కార్యాలయంలో దరివాదకొత్తపాలెంకు చెందిన మరుప్రోలు తిరుపతిరెడ్డి వైఎస్సార్సీపీ తరఫున తొలి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.