బాలికల రక్షణపై లఘు చిత్రాల పోటీలు
బాలికల రక్షణపై లఘు చిత్రాల పోటీలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవకాశం
భీమవరం, మేజర్ న్యూస్: అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు జిల్లా స్థాయి లఘు చిత్రాల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సి.హెచ్. భారతలక్ష్మి తెలిపారు.అక్టోబర్ 11న నిర్వహించనున్న అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘లింగ నిర్ధారణ పరీక్షలను అరికడదాం–బాలికలను రక్షిద్దాం’ అనే అంశంతో పాటు పీసీ అండ్ పీఎన్‌డీటీ చట్టం-1994పై విద్యార్థులు, ప్రజల్లో అవగాహన కల్పించడమే పోటీల ప్రధాన ఉద్దేశమన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE), సంబంధిత విద్యాశాఖ అధికారుల సమన్వయంతో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామాజిక బాధ్యతను ప్రతిబింబించేలా లఘు చిత్రాలను రూపొందించి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన లఘు చిత్రాలకు ప్రథమ బహుమతి రూ.30 వేలు, ద్వితీయ బహుమతి రూ.20 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలతో పాటు ప్రశంసాపత్రాలు అందజేస్తామని తెలిపారు.పోటీల పూర్తి వివరాలు, ఎంట్రీల సమర్పణ నిబంధనల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జిల్లా కో-ఆర్డినేటర్‌ను సంప్రదించాలని డీఎంహెచ్‌వో సూచించారు.
శ్రీనివాస్ భీమవరం