BREAKING
రాజుపేట పాములేరు వంతెన వద్ద డైవర్షన్ రహదారి పనులకు శ్రీకారం స్వామి పుష్కరిణి: సర్వతీర్థాల సంగమం, సకల అభీష్టాల ప్రదాయిని శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం. లోక కళ్యాణమే లక్ష్యంగా మల్లేశ్వరునికి అభిషేకం పెద్దింటి అమ్మవారి సన్నిధిలో వరుణ్ యోగం శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనాల చెవులలో పువ్వులు పెట్టొద్దు చెవిరెడ్డి. సిమెంట్ బెంచీలు బహుకరణ కోయ, గోండు వర్క్‌షాప్‌లో పాల్గొన్న తాటి పీఎం సూర్య షూర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ వెల్లడి ఎన్నికల వ్యవస్థను బ్రష్టు పట్టింది బిజెపి పాఠశాల, కళాశాల బస్సుల్లో రహదారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి ఆర్టీఓ రంగనాయకులు రైతు బజార్ అక్రమ వసూళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ డిమాండ్ 4,563 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వాటి విలువ సుమారు రూ.11.40 కోట్లు. రికవరీ రికవరీ పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల బృందం

అస్సూరెన్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని

Select Suryaa Now
అస్సూరెన్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని

అనంతపురం బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటికి సంబంధించిన పనులు అమలయ్యాయా లేదా అనే అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు అస్సూరెన్స్ కమిటీ సమావేశం నిర్వహించింది.

విజయవాడలో అస్సూరెన్స్ కమిటీ చైర్మన్ కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సహచర కమిటీ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అసెంబ్లీలో సభ్యులు ప్రస్తావించిన అంశాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు పురోగతిని సమీక్షించారు. ఇంకా అమలు కావాల్సిన హామీలు, పెండింగ్‌లో ఉన్న పనులపై అధికారులతో చర్చించి, వాటి పురోగతిని తెలుసుకున్నారు. ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యేలా నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరాన్ని కమిటీ సభ్యులు చర్చించారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సమావేశంలో సూచించారు.