అసెంబ్లీకి రావడంలో జగన్ డక్ అవుట్.. బెంగళూరు–తాడేపల్లి ప్రయాణాల్లో మాత్రం సెంచరీలు: ఎంపీ సానా సతీష్ బాబు
అమరావతి, మేజర్‌న్యూస్ :
బెంగళూరు–తాడేపల్లి రౌండ్ ట్రిప్పుల్లో సెంచరీ పూర్తి చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలంటూ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు తిరగడంలో జగన్ సెంచరీలు కొడుతున్నారని, కానీ అసెంబ్లీకి రావడంలో మాత్రం కెప్టెన్‌గా డక్ అవుట్ అయ్యారని ఎద్దేవా చేశారు. రెండున్నరేళ్లలో అసెంబ్లీ హాజరు సున్నా అని విమర్శించారు. బెంగళూరు–తాడేపల్లి రౌండ్ ట్రిప్పుల్లో డబుల్, ట్రిపుల్ సెంచరీలు చేసేలా ఉన్న జగన్.. ఈసారైనా అసెంబ్లీకి వస్తారా? లేదా? అని ప్రశ్నించారు. జగన్ అండ్ టీమ్ క్రికెట్ జట్టుకు సరిపడా కేవలం 11 మంది ఉన్నారని కానీ కెప్టన్ జగన్ అసెంబ్లీ పిచ్ కు హాజరవ్వకుండా బెంగుళూరు ఏపీ రౌండ్ ట్రిప్ లలో సెంచరీ చేశారని ఎంపీ సానా సతీష్ బాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.