అర్ధరాత్రి వేళ వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఇంటిపై రాళ్లదాడి!
మాస్కులు ధరించి మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. సీసీ కెమెరాల్లో ఘటన రికార్డు?
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:
ప్రొద్దుటూరు పట్టణంలోని శాస్త్రినగర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి నివాసంపై అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోరెడ్డి నరసింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి 1.47 గంటల సమయంలో మాస్కులు ధరించిన ముగ్గురు వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై ఆయన ఇంటి వద్దకు వచ్చారు. అనంతరం ఇంటిపై రాళ్లు విసిరి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు ఆయన వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి నివాసంపై ఈ తరహా దాడి జరగడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే, ఈ ఘటన వెనుక ఎవరున్నారు? దాడికి గల కారణాలేమిటి? అనే విషయాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.
- ఎ ప్రతాప్ కుమార్ ప్రొద్దుటూరు అర్బన్ వైఎస్సార్ కడప జిల్లా