అనవరంలో వైసీపీలోకి 50 కుటుంబాలు!
బాడంగి, సూర్య : బాడంగి మండలం అనవరం గ్రామ పంచాయతీ పరిధిలో తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారుగా 50 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. సోమవారం బొబ్బిలిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాల్ నాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
అనవరం గ్రామ మాజీ ఉపసర్పంచ్ డోకల అప్పలనాయుడు, ఈదిబిల్లి పైడుపునాయుడు, చొక్కపు శ్రీనివాసరావు, ఈదిబిల్లి శ్రీరామ్, బన్నీ తదితరుల ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
ఈ సందర్భంగా శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ.. ఇటీవల అనవరం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీడీపీలో చేరారని పేర్కొన్నారు. అయితే, ఒకరు పార్టీని వీడితే వారి స్థానంలో పదిమంది వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో చింత చిన్నారావు, చింత ప్రమిల, యందవ ప్రసాదు, వలగంటి యేసు, యజ్జల ప్రసాదు, చింత జోజీ, యందవ శాంతారావు, జొన్నాడ దాసు, యందవ దాలయ్య, యందవ లక్ష్యము, యందవ రాజేష్, చింత రవి, వలగంటి కృష్ణ, యుర్రిరపు జోజి, జొన్నాడ రాయప్ప, లంకా పవన్, అలమండ రవి, నిలబోను అప్పలనాయుడు, బొంగల సత్యనారాయణ, పోతభత్తుల వెంకీ, మరడ సత్యనారాయణ, కరణం సత్యం, వాకడ పోలినాయుడు, కలిగి ఆది, సిరికి సింహాచలం తదితరులు ఉన్నారు.
రిపోర్టర్ : శ్రీనివాసరావు, బాడంగి, విజయనగరం జిల్లా.