BREAKING
రూ. 8,415 కోట్ల AT-1 బాండ్ల రద్దు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యెస్ బ్యాంక్ సిగరెట్ ధరలను మళ్లీ పెంచిన ఐటీసీ: గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ కనెక్ట్ కొత్త రేట్లు ఇవే నేటి పంచాంగం 14 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు (14 నవంబర్ 2026, శనివారం): 12 రాశుల దినఫలాలు ఇవే మాస్కోలో భారీ కారు బాంబు పేలుడు: రష్యా అనుకూల నేత సెర్గీ జవోరోట్నీకి తీవ్ర గాయాలు అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై మరింత ఉచ్చు

అంతర్జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ

Select Suryaa Now
అంతర్జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : పద్మావతి మహిళా వర్సిటీ బయోటెక్నాలజీ విభాగం, తెలంగాణ మహబూబ్‌నగర్ పాలమూరు విశ్వవిద్యాలయం మైక్రో బయాలజీ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో  బయోమైక్రో ఫ్రాంటియర్స్ -2026 ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేషన్స్ ఇన్ బయోటెక్నాలజీ అండ్ మైక్రోబయాలజీ ఫర్ సస్టైనబిలిటీ" అనే అంశంపై డిసెంబర్ 17, 18 తేదీలలో అంతర్జాతీయ సదస్సును హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను వర్సిటీ ఉపకులపతి ఆచార్య వి.ఉమ, రిజిస్ట్రార్ ఆచార్య ఆర్.ఉష ఆవిష్కరించారు. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ రంగాలలో అభివృద్ధి చెందుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, పరిశోధన ఫలితాలు, వాటి అనువర్తనాలపై శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు, పారిశ్రామిక నిపుణులు, విద్యార్థులు తమ ఆలోచనలను పంచుకునేందుకు అంతర్జాతీయ వేదికను కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రొఫెసర్ బి.కిషోరి, బయోటెక్నాలజీ విభాగ అధిపతి సదస్సు కన్వీనర్, ప్రొఫెసర్ పి.జోత్స్న, ప్రొఫెసర్ ఎన్. జాన్ సుష్మ, ఒప్పంద అధ్యాపకులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్