అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అన్నవరం దేవస్థానం అధికారులు
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: దసరా ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం మధ్యాహ్నం అన్నవరం దేవస్థానం తరఫున ఈవో శ్రీ చక్రధర రావు ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అన్నవరం దేవస్థానం నుంచి వచ్చిన అధికారుల బృందానికి విజయవాడ దుర్గగుడి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనా నాయక్ స్వాగతం పలికారు. అనంతరం అధికారులు శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకోగా, ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించారు. దేవస్థానం తరఫున ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.