అంగన్వాడీ ఉత్సవం....
పెండ్లిమర్రి,మేజర్ న్యూస్...
దేశ ప్రధాని 76వ జయంతి సందర్భంగా, సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా ఈరోజు మండల కేంద్రమైన పెండ్లిమర్రి, చెర్లోపల్లి పంచాయతీ అంగన్వాడీ కేంద్రాల వారు నిర్వహించిన అంగన్వాడి ఉత్సవ కార్యక్రమంలో కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు కమలాపురం అంగన్వాడి ఉత్సవ ఇంచార్జి సంగటి రామ్మోహన్ రెడ్డి, ఐ. సి. డి. ఎస్. సిడిపిఓ గురమ్మ, మరియు వెల్లటూరు పెండ్లిమర్రి సూపర్వైజర్ బి కల్పన ఎస్ శంషాద్ బేగం, నాగ మల్లారెడ్డి, మరియు పెండ్లిమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి ప్రసాద్ పాల్గొని బాలింతలు మరియు గర్భిణీలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు శ్రీ టి విజయలక్ష్మి మరియు ఎం వరలక్ష్మి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.