BREAKING
పాల ఉత్పత్తిలో గ్రామీణ మహిళలే కీలకం -సీడీటీలో ఘనంగా జాతీయ పాల దినోత్సవం -ఉత్తమ మహిళా పాడి రైతుగా టి.విద్యకు సత్కారం రాజ్యాంగ విలువలే విద్యార్థులకు మార్గదర్శకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన

Select Suryaa Now
అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన

అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన

సభాస్థలిని పరిశీలించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్

మదనపల్లె, అన్నమయ్య జిల్లా, సెప్టెంబరు 28:
అక్టోబర్ 2న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు వీఐపీలు మదనపల్లెకు రానున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు.

ఈ సందర్భంగా సోమవారం చంద్రకాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ పరిశీలించారు. సభా ప్రాంగణం, వీఐపీల రాకపోకలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.సభా ప్రాంగణం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ అధికారులకు సూచించారు. వీఐపీల పర్యటన నేపథ్యంలో ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, ప్రజల సౌకర్యానికి సంబంధించి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఐఏఎస్, డీఎస్పీలు ఎం. బుచ్చిరాజు, డి. ఏడుకొండల రెడ్డి, ఎస్బీ సీఐ యు. సదాశివయ్యతో పాటు పలువురు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.