అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నా రెండు టిప్పర్లు స్వాధీనం
దువ్వూరు, మేజర్ న్యూస్ :మండల పరిధిలోని నీలాపురం గ్రామం,దువ్వూరుగ్రామాల పరధిలోని గుట్టల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న రెండు గ్రావెల్ టిప్పర్లను రెవెన్యూ, పోలీస్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వివరాలలోకి వెళితే ఇటీవల దువ్వూరు గుట్ట, నీలా పురం గుట్టలల్లో ఎక్కువ సంఖ్యలో గ్రావెల్ రవాణా చేస్తున్నారని, వీటికి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో విచ్చలవిడిగా రవాణా చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆ ప్రాంత రైతులు తమ పొలాల్లో దుమ్ము, ధూళి పడి పంటలు దెబ్బతింటున్నాయని పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తహసిల్దార్ సునీత అక్రమ రవాణాను ఆపేందుకు గాను వీఆర్ఎలు, వీఆర్వోలచే బందోబస్తు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా శనివారం రాత్రి దువ్వూరు కొండ నుండి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న రొండు టిప్పర్లను పోలీస్ సిబ్బంది సహాయంతో స్వాధీనం చేసుకుని స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద ఉంచారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది మాట్లాడుతూ ప్రతి రోజు వీఆర్ఎలచే, వీఆర్ ఓలతో బందోబస్తు ఏర్పాటు చేశామని వారికి పోలీస్ సహకారం కూడా ఉంటుందని అందువల్ల ఎవరైనా గాని అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఏఎస్ఐ సుబ్బయ్య, వీఆర్వోలు, వీఆర్ఏ లు పాల్గొన్నారు.
రిపోర్టర్: బోర్రా శివరామిరెడ్డి, మైదుకూరు ఇంచార్జ్, కడప జిల్లా