BREAKING
పట్టభద్రుల ఓటు నమోదుపై కాంగ్రెస్ అవగాహన.. అర్హులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి: కర్రె రాజేష్ యాదవ ప్రముఖులకు, వివాహ ఆహ్వాన పత్రికలు అందించిన చిత్తారు సింహాద్రి యాదవ్ మేకల మల్లిబాబు యాదవ్ --ప్రముఖులు తలసాని, బీర్ల ఐలయ్య,నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ లను ఆహ్వానించిన సింహాద్రి యాదవ్, మేకల మల్లిబాబు యాదవ్ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలి.. - అడిషనల్ డీఆర్డీఓ మల్లేశం స్వర్ణగిరి కాలనీలో సెప్టిక్ ట్యాంక్ స్థలానికీ ఎసరు.. అధికారుల పర్యవేక్షణ ఏది..? కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి విజేతలకు శుభాకాంక్షలు... అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: ఎమ్మెల్సీ అభ్యర్థి పట్లోళ్ల అమరేందర్ రెడ్డి పొగాకుకు దూరంగా ఉండాలి గుర్తు తెలియని వాహనం డీకొని వ్యక్తి మృతి ​ ఎస్సీ హాస్టల్ విద్యార్థుల తాగునీటి కష్టాలకు చెక్.. నూతన బోర్‌వెల్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ​సింహగిరిపై భక్తులకు సాంప్రదాయ దుస్తుల నియమావళి తప్పనిసరి * ఇఓ జల్లేపల్లి వెంకట్రావు * నిఘా నీడలో ఓట్ల లెక్కింపు. ఏర్పాట్లు పూర్తి. ఆర్ ఓ వెంకటరెడ్డి కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు ట్రాఫిక్ మళ్లింపు పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలి ఆధునిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎదగండి ---ఎయిడ్ సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కే శ్రీనివాస్

"అధికారపార్టీ ప్రైవేట్ సైన్యంగా వ్యవహరించిన పోలీస్ _ కాకాణి"

Select Suryaa Now
"అధికారపార్టీ ప్రైవేట్ సైన్యంగా వ్యవహరించిన పోలీస్ _ కాకాణి"

నెల్లూరు,  మేజర్ న్యూస్ :  మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల తరహాలోనే నిన్న ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వం తీవ్రస్థాయిలో అరాచకాలు, అక్రమాలకు పాల్పడి అధికార దుర్వినియోగానికి ఒడిగట్టిందని నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల మద్దతు లేని అధికార పక్షం ఎన్నికల్లో గెలవడానికి సర్వశక్తులూ ఒడ్డి పోలీసు యంత్రాంగాన్ని తమ ప్రైవేట్ సైన్యంగా వాడుకుందని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిన్నటి ఎన్నికల్లో అధికార పార్టీతో కాకుండా, అంతా తామై వ్యవహరించిన పోలీసు వ్యవస్థతోనే పోరాడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని, వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను అక్రమంగా నిర్బంధించి, కనీసం ఓటు హక్కు కూడా వినియోగించుకోకుండా స్టేషన్లలో బంధించారని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూతుల్లోకి చొరబడి వైయస్సార్సీపీ ఏజెంట్లను నెట్టివేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆధారాలతో సహా ఎత్తిచూపారు. ఈ మొత్తం ఉదంతాలపై జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్, జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించి నిష్పక్షపాత విచారణ జరపాలని, నిబంధనలు ఉల్లంఘించిన పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలను రద్దు చేసి తక్షణమే రీపోలింగ్ నిర్వహించాలని గట్టిగా డిమాండ్ చేశారు.

అధికార పార్టీతో కాదు.. పోలీసు వ్యవస్థతోనే పోరాడాం:

నిన్న జరిగిన పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడింది అధికార పార్టీతో కాదు.. సర్వస్వం తామై నిలిచిన పోలీసు వ్యవస్థతో, అధికారులతోనే పోరాడాం. ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఆదరణ లేదు. వైఎస్సార్‌సీపీని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక పోలీసులను అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ అంటూ కంటితుడుపు చర్యలు చేపట్టి, జిల్లా అధికార యంత్రాంగం అంతా సజావుగా జరిగిందంటూ నాటకమాడింది.

ఉగ్రవాదుల్లా పోలింగ్ ఏజెంట్ల అక్రమ నిర్బంధం:

ముందురోజు సాయంత్రం ఎన్నికల అధికారుల వద్ద ధ్రువీకరణ పత్రాలు తీసుకుని బ్యాడ్జీలు తెచ్చుకున్న మా పోలింగ్ ఏజెంట్ల వివరాలు సేకరించి, రాత్రికి రాత్రే వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఏదో అంతర్జాతీయ ఉగ్రవాదులను తరలించినట్లు ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు మారుస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. ఏజెంట్ల ఫోన్లు లాక్కుని, ఎవరికైనా చెబితే అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరించారు. పొదలకూరు మండలం చెన్నారెడ్డిపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ,స్టేషన్లలో అక్రమంగా కూర్చోబెట్టి కనీసం ఓటు కూడా వేయనీయలేదు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాలరాసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు?

పోలీసుల సమక్షంలోనే కార్యకర్తలపై రక్తపాతం:

ముత్తుకూరులో ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు ఐడెంటిటీ కార్డు అడిగినందుకు దినేష్ అనే మా బూత్ ఏజెంట్‌పై టీడీపీ రౌడీలు విచక్షణారహితంగా దాడి చేసి గాయపర్చారని,
పోలీసులు అతడిని కాపాడాల్సింది పోయి, బలవంతంగా బయటకు పంపే క్రమంలో టీడీపీ మూకలు అతనిపై దాడి చేసినా ఆపే ప్రయత్నం చేయలేదు. వెంకటాచలంలో టిడిపి గూండాల దాడిలో తీవ్ర గాయాల పాలయిన యువకుడు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయబోతుంటే స్టేషన్ ఎదుటే మళ్లీ దాడి చేస్తుంటే పోలీసులు చేష్టలుడిగి చూశారు తప్ప ఒక్కరిపైనా కేసు పెట్టలేదు. గాయపడిన మా కార్యకర్తలను బయటకు తరిమేసి, టీడీపీ గూండాలకు కొమ్ముకాస్తూ శాంతిభద్రతలను అంపశయ్యపైకి చేర్చారు.

మంత్రులు, ఎమ్మెల్యేల బూత్ క్యాప్చరింగ్:

సాక్షాత్తు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోలింగ్ బూతుల్లోకి చొరబడి బూత్ క్యాప్చరింగ్‌కు పాల్పడ్డారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రంలోకి అభ్యర్థి లేదా ఆయన తరఫు ఎలక్షన్ ఏజెంట్ మాత్రమే వెళ్లాలి. ఎలాంటి అధికారిక హోదా లేని మాజీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి మా పార్టీ ఎలక్షన్ ఏజెంట్‌గా బూత్‌కు వెళ్తే సీఐ గంగాధర్ అమర్యాదగా ప్రవర్తించి బయటకు నెట్టేశారు. అదే సమయంలో మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి మాత్రం యథేచ్ఛగా బూతుల్లోకి ఎలా వెళ్తారు? ఆత్మకూరు,సర్వేపల్లి , కావలి, ఉదయగిరి, కందుకూరులలో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్లి కూర్చుని మా ఏజెంట్లను తరిమేసి రిగ్గింగ్ చేయించారు.

పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ చేయించిన దౌర్జన్యం:

గూడూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ బి.గురవయ్య ఇంటిపై టీడీపీ గూండాలు పడి విచక్షణారహితంగా దాడులకు యత్నించారు. మర్రిపాడు మండలం తిక్కవరంలో ఎస్సై బలరాంరెడ్డి మా ఏజెంట్ కాలర్ పట్టుకుని బయటకు లాగేసి, తలుపులు వేసి పది మంది టీడీపీ వ్యక్తులతో రెండు వందల దొంగ ఓట్లను రిగ్గింగ్ చేయించారు. పెళ్లకూరులో సీఐ స్వయంగా మా ఏజెంట్లను బయటకు పంపించి రిగ్గింగ్‌ను ప్రోత్సహించారు. పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులను మాత్రమే బూత్‌లలో నియమించుకుని వ్యవస్థను ఇంత దారుణంగా భ్రష్టుపట్టించడం చరిత్రలో ఎన్నడూ చూడలేదు.

రీపోలింగ్ నిర్వహించి.. రేపటి కౌంటింగ్ నిలిపివేయాలి:

జిల్లాలో జరిగిన ఎన్నికల ఉల్లంఘనలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన అన్ని వీడియో ఆధారాలను జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు అందజేశాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు చొరబడిన బూతుల్లో సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిన అన్ని కేంద్రాల్లో ఎన్నికలను తక్షణమే రద్దు చేసి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించి రీపోలింగ్ నిర్వహించాలి. అప్పటివరకు రేపు జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయాలి.

ప్రజాస్వామ్యంపై  నమ్మకం కలిగించాలి...

ఈ నేపధ్యంలో రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియ సాగడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని కాకాణి గోవర్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు. అవసరమైతే ఎన్నికలను మరో రోజు నిర్వహించి, సాయంత్రం నుంచి కౌంటింగ్‌ పూర్తి చేయాలన్నారు. లేదంటే ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉందని తేల్చి చెప్పారు. మరోవైపు ఎన్ని బెదిరింపులు, అక్రమ కేసులు, దాడులు ఎదురైనా ప్రాణాలకు తెగించి పోరాడిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులందరికీ శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు.