BREAKING
భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు శ్యామల బేకరీ ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైసీపీలో చేరిక పాలకొండ ఏరియా ఆసుపత్రిలో నూతన హంగులు మాజీ మంత్రి పువ్వాడ దసరా వేడుకలు

అభ్యర్థులు ఎంపికలో వైసీపీ, తేదేపా నేతలు కసరత్తు

Select Suryaa Now
అభ్యర్థులు ఎంపికలో వైసీపీ, తేదేపా నేతలు కసరత్తు

గుర్ల, సూర్య : స్థానిక సంస్థలు ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైందని చెప్పవచ్చు. ఇప్పటికే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో వైయస్సార్ పార్టీ టిడిపి పార్టీ ముఖ్య నేతలు అభ్యర్థులు ఎంపికలో జాగ్రత్తలు వహిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరఫున 18 ఎంపీ స్థానాలు గాను అభ్యర్థులను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కూటమి అభ్యర్ధులు ఎదురొడ్డి నిలబడాలంటే కాస్త అభ్యర్థుల ఎంపిక విషయంలో వైసీపీ నేతలు కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నారని విశ్వనీయ సమాచారం. ఏంపీపీ అన్ రిజర్వ్డ్ కావడంతో టిడిపి ఎంపీపీ విషయంలో పార్టీ లో కొంతమంది నేతలు పోటీ పడినప్పటికీ పార్టీ అధిష్టానం వెన్నె సన్యాసినాయుడు కి ఓకే చెప్పారనీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక వైయస్సార్ పార్టీ తరపున ఎంపీపీ విషయంలో పోటీపడినప్పటికీ మరల పొట్నూరు సన్యాసినాయుడికే ఒకే అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక జడ్పిటిసి విషయంకొస్తే జడ్పిటిసి బీసీ మహిళ కావడంతో టిడిపిలో కొంతమంది నేతలు పోటీ పడినప్పటికీ చనమల్ల రాధకు అధిష్టానం ఓకే చెప్పినట్లు విశ్వనీయ సమాచారం. ఇక వైయస్సార్ పార్టీ విషయానికి వస్తే జడ్పిటిసి అభ్యర్థిగా మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ బరిలో నిలుస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా నామినేషన్లకు గడువు  ఈనెల 21, 22, 23తేదీలలో నిర్ణయించడంతో ఆయా పార్టీ వర్గాలు అభ్యర్థులు జాబితా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని విశ్వనీయ సమాచారం  నామినేషన్లు దగ్గర పడుతుండడంతో  అటు కూటమి పార్టీ ఇటు వైయస్సార్ పార్టీ నేతలంతా ప్రత్యేక శిబిరాల ద్వారా అభ్యర్థులు ఎంపిక విషయంలో కసరత్తులు చేపడుతున్నారు.

రిపోర్టర్ : రాము నాయుడు, గుర్ల, విజయనగరం జిల్లా.